Site icon NTV Telugu

‘గమ్మత్తు’ చేస్తానంటున్న పార్వతీశం, స్వాతి దీక్షిత్

అంకిత శ్రీనివాస రావు, బి. మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గమ్మత్తు’. ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ జంటగా నటిస్తున్నఈ మూవీ టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ మూవీకి వసంత్ సంగీతాన్ని అందించగా, అశ్వనీ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవతో పాటు ‘వకీల్ సాబ్’ మూవీలో సూపర్ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన లిరీష కీలక పాత్రలు పోషించారు. వినోద ప్రధానంగా సాగే ఈ మూవీకి మాటలు నివాస్, పాటలు భాస్కరభట్ల రాశారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా జరుపుకుంటోందని, అతి త్వరలోనే జనం ముందు సినిమాతో వస్తామని దర్శక నిర్మాతలు అంటున్నారు.

Exit mobile version