Site icon NTV Telugu

Re Shoot: 10 కోట్లు బూడిదలో పోయించిన పాన్ ఇండియా స్టార్

Pan India Hero

Pan India Hero

అతను ఒక పాన్ ఇండియా స్టార్ హీరో. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలో దాదాపు పది కోట్లు ఖర్చుపెట్టి ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సదరు స్టార్ హీరో బదులు అతని బాడీ డబుల్ నటించాడు. అయితే ఆ సీక్వెన్స్ రష్ మొత్తం చూసిన సదరు స్టార్ హీరో అబ్బే, ఇది ఏమీ బాలేదు. ఈ సీక్వెన్స్ మళ్ళీ రీషూట్ చేద్దాం అంటూ దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చాడట.

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. కడప రిమ్స్ కి తరలింపు !

త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న దర్శక నిర్మాతలు సదరు హీరో ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేక పోతున్నారట. ఎందుకంటే ఈ సీక్వెన్స్ కోసం దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాన్ని రీషూట్ చేయడం అంటే ఆ పది కోట్లను బూడిదలో పోసినట్లే అని వారు ఫీల్ అవుతున్నారట. అసలు హీరో నేరుగా వచ్చి షూటింగ్లో పాల్గొని ఉంటే ఇంత టెన్షన్ ఉండకపోయేదని వారు బాధ పడుతున్నారు. హీరో చెప్పినట్టే ఆ సీక్వెన్స్ మళ్ళీ షూట్ చేయక తప్పని పరిస్థితుల్లో ఆ నిర్మాతలు రీషూట్ కి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version