NTV Telugu Site icon

Pan – India Film : మైత్రీ మూవీస్ వారి భారీ పాన్ ఇండియా సినిమా.!

Lam

Lam

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సంస్థ అనగానే గుర్తొచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పుష్ప -2, ప్రభాస్ హను రాఘవ పూడి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వంటి భారీ పాన్ ఇండియాలన్నిటిని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల టాలీవుడ్ దాటి ఇతర భాషాల హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ కోవాలోనే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Also Read : Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే

తాజాగా మైత్రీ నిర్మాతలు మరో సెన్సేషన్ కాంబోకు శ్రీకారం చుట్టారు. ఈ దఫా సౌత్ నార్త్ కాంబినేషన్ ను కలిపారు మైత్రీ మేకర్స్. బాలీవుడ్ ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ ఇటీవల వరుస ప్లాప్స్ తో సతమవుతుతున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అమీర్ ఖాన్. అతడే తమిళ బ్లాక్ బస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇందుకు సంభందించి కథా చర్చలు కూడా ముగిసాయి. లోకేష్ కథకు అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే మరొక బాలివుడ్ హీరో సన్నీ డియోల్ తో సినిమా చేస్తుంది మైత్రీ. ఇప్పుడు అమీర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనుంది. ఈ ఇద్దరి కాంబోలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో అమిర్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Show comments