Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్ కు బుర్రపాడు… మెంటలెక్కించే ట్విస్టులు మావా

Over Your Dead Body

Over Your Dead Body

Over Your Dead Body: ఓటీటీలోకి వస్తున్న సినిమాలలో థ్రిల్లర్ కంటెంట్ నే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో వచ్చినా వీటిని మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. టైమ్ దొరకితే చాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చిల్ అవుతున్నారు. హాలీవుడ్‌లో ఇటీవల థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న సినిమాలు హత్యలు, ఛేజ్‌లతో మాత్రమే కాకుండా, కుట్రలు, కుతంత్రాలను కూడా బలంగా చూపిస్తున్నాయి. అలాంటి డార్క్ కామెడీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చేసింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు. బయటకు చూస్తే మంచి దాంపత్య జీవితం ఉన్నట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఒకరిపై ఒకరికి ద్వేషం, అనుమానం, పగ. ఒక వైపు మ్యారేజ్ డ్రామా, మరోవైపు క్రిమినల్ సర్వైవల్ గేమ్‌లా సాగిపోయే కథ ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవనివ్వదు. ట్విస్ట్ మీద ట్విస్ట్‌లతో కథను ముందుకు నడిపించే ఈ ఇంగ్లీష్ మూవీ పేరు ‘Over Your Dead Body’. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
2026 ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ‘ఓవర్ యువర్ డెడ్ బాడి’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక Amazon Prime Video లో మే 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఇది రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాల్లో రిలేషన్‌షిప్ డ్రామా, డార్క్ హ్యూమర్, సర్వైవల్ టెన్షన్ అన్నీ కలిసిన కథలు ఇష్టపడేవారికి ‘Over Your Dead Body’ మంచి వీకెండ్ వాచ్‌గా మారుతోంది. జేసన్ సెజల్, సమరా వీవింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక గ్రే షేడ్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎవరు మంచివాళ్ళు? ఎవరు ప్రమాదకా రులు? అనే సందేహం చివరి వరకు వెంటాడుతుంది. ముఖ్యంగా ఒకే లొకేషన్‌లో కథను నడిపిస్తూ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

కథ ఏమిటంటే
కథలో డాన్ బర్టన్ అనే ఫ్లాప్ ఫిల్మ్ డైరెక్టర్ తన కెరీర్‌లో చిన్న చిన్న యాడ్స్ తీసుకుంటూ జీవితం నెట్టుకొస్తుంటాడు. అతని భార్య లిసా మాత్రం నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ వాళ్ళ మధ్య ప్రేమ కంటే విభేదాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు, అసూయ, అహం కలిసి వాళ్ళ సంబంధాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. చివరకు డాన్ తన భార్యను చంపేసి ఆమె ఆస్తిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం హెన్రీ అనే క్రిమినల్ సహాయం తీసుకుని నగరానికి దూరంగా ఉన్న ఓ లేక్ హౌస్‌కు భార్యను తీసుకెళ్తాడు.

అక్కడి వరకు చూస్తే ఇది సాధారణ క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. డాన్ తన ప్లాన్ అమలు చేయబోతుండగానే లిసా అతనిని కట్టేసి తానే ముందుగా అతన్ని చంపేయాలని వచ్చానని చెబుతుంది. ఈ ట్విస్ట్ తో చూసే ఆడియన్స్ కి కూడా పిచ్చెక్కిపోతుంది. అప్పటిదాకా ఒకరిపై ఒకరు వేసుకున్న ముసుగులు కూడా తొలగిపోతాయి.

అయితే ప్రేక్షకులు ఊహించని అసలు గందరగోళం ఆ తర్వాత మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న ముగ్గురు ప్రమాదకర ఖైదీలు అప్పటికే ఆ ఇంట్లో దాక్కుని ఉంటారు. పీట్, టాడ్, అల్లెగ్రా అనే ఆ ముగ్గురు ఖైదీలు ఈ దంపతులను బంధించి డబ్బు కోసం చిత్రహింసలు పెట్టడం మొదలుపెడతారు. ఒక్కసారిగా హత్య చేయాలనుకున్న భార్యాభర్తలే ఇప్పుడు కలిసి బతికే పరిస్థితికి చేరుకుంటారు. చివరికి ఈ భార్యాభర్తలు ఆ క్రిమినల్స్ నుంచి తప్పించుకుంటారా ? వీళ్ళు మళ్ళీ కలిసి జీవిస్తారా ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ కూడా ఉత్కంఠంగా ఉంటుంది.