NTV Telugu Site icon

OTT : కేరళ ‘ఓనమ్ విన్నర్ ARM’ .. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

Arm

Arm

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” . టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. కేరళలో ముఖ్యమైన పండుగ ఓనమ్ కానుకగా సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ARM బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

నాలుగు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా యూనానిమస్ గా హిట్ టాక్ అందుకుని, సోలో హీరోగా టోవినో థామస్ కెరీర్ లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాగా ARM నిలిచింది. ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఇటీవల  50 రోజుల కంప్లిట్ చేసుకుంది. తాజగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను ప్రకటిచారు మేకర్స్. ఈ సినిమాను విడుదలకు ముందుగానే ప్రముఖ ఓటీటీ నిర్మాణ సంస్థ హాట్ స్టార్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. సూపర్ సక్సెస్ ఫుల్ థియేటర్ రన్ తర్వాత నవంబరు 8న ఈ సినిమాను హాట్ స్టార్ లో అన్ని బాషలలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది సదరు సంస్థ. టోవినో థామస్ కు కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేయగా అంత ఆదరణ పొందలేదు.

Show comments