NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప – 2 అంటే ఆ మాత్రం భయం ఉండాలా..

Clash

Clash

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఫోటో వైరల్

కాగా మొదట సినిమాను డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ తాజాగా నిర్వహించిన మీడియా మీట్ లో ఈ సినిమాను డిసెంబరు 5 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పుష్ప – 2 కు పోటీగా వేరే ఏ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు సదరు నిర్మాతలు. ఒకవేళ వచ్చిన థియేటర్స్ దొరకని పరిస్థితి. పుష్పరాజ్ క్రేజ్ ముందు తమ సినిమాలు నిలబడవని భావించి తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు పుష్ప లైన్ క్లియర్ చేశాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ ను రిలీజ్ చేస్తామని ఆ ఆ మధ్య ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డిసెంబరు 6న వచ్చే అవకాశం కనిపించట్లేదు. పుష్ప -2 తో పోటీ ఎందుకులే అని భావిస్తున్నారట ఛావా మేకర్స్. అటు పుష్ప, ఇటు ఛావా రెండింటిలోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం.

Show comments