Site icon NTV Telugu

oscar winner: ఆస్కార్ అవార్డ్ విన్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల..

Untitled Design (8)

Untitled Design (8)

ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు.

Also Read: LION KING: ‘ముఫాసా ది లయన్ కింగ్’ కోసం టాలీవుడ్ కింగ్..

ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ “వెడ్డింగ్ డైరీస్ చిత్ర ట్రైలర్ ను చూసాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్ధాలు అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ శాశ్వతం కాదు. శాశ్వతం గా ఉండేది వైవాహిక బంధం మాత్రమే అనే మంచి కథ తో ఈ వెడ్డింగ్ డైరీస్ చిత్రం తో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. హీరో గా నటించిన అర్జున్ అంబటి టాలెంట్ ఉన్న నటుడు అలాగే హీరోయిన్ చాందిని తమిలారసన్ గారికి దర్శకుడు వెంకటరమణ మిద్దె గారికి నా శుభాకాంక్షలు. అలాగే సంగీత దర్శకుడు మదిన్ ఎస్ కె మంచి పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం లో పని చేసిన అందరికి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న విడుదల అవుతుంది. అందరు చూసి ఈ చిత్రానికి మంచి విజయం అందించాలి” అని కోరుకున్నారు.

Also Read: Pushpa : విభేదాలకు చెక్ పెట్టేందుకు ఒకే వేదికపైకి బన్నీ- సుక్కు..

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్ర బోస్ గారు మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వెడ్డింగ్ డైరీస్ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం” అని తెలిపారు.

Exit mobile version