Site icon NTV Telugu

ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్

Oo PillaNeeValla Video Song from Mugguru Monagallu

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన “ముగ్గురు మొనగాళ్లు” చిత్రం నుంచి ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హీరోయిన్ పై హీరో తన లవ్ ఫీలింగ్ ను వ్యక్తం చేసే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాజిన్ నిజార్ వాయిస్ లో జాలువారిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ సాంగ్ కు కడలి లిరిక్స్ అందించారు.

Read Also : “కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్

కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న “ముగ్గురు మొనగాళ్లు”లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా… ఇలా ముగ్గురూ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. రాజా రవీంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మర్డర్ మిస్టరీలో చిక్కుకున్న ఈ ముగ్గురు మొనగాళ్లు ఆ కేసును ఎలా ఛేదించారనేది చిత్ర కథాంశం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా విడుదలైన “ఓ పిల్లా నీ వల్ల” యూత్ ఫుల్ రొమాంటిక్ వీడియో సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

Exit mobile version