Site icon NTV Telugu

Harsha Sai: హర్షసాయిపై మరోకేసు

Harsha Sai News

Harsha Sai News

One More Complaint on Harsha Sai: హర్ష సాయి కేసు మరో మలుపు తిరిగింది. హర్ష సాయి పై మరోసారి ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు. నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన హర్ష సాయి బాధితురాలు, తన అడ్వకేట్ తో కలిసి హర్ష సాయి టార్చర్ చేస్తున్నాడని మరోసారి ఫిర్యాదు చేసింది. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు నాలుగు టీంలతో గాలింపు మొదలు పెట్టారు.

Devara : నైజాం – నార్త్ అమెరికా దేవర అడ్వాన్స్ కలెక్షన్స్ వివరాలు..

అదే విధంగా హర్ష సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగులో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక వేధింపుల ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. గతంలో తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న ఒక యువతి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376,,354, 328 కింద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. అలాగే హర్ష సాయికి సంబంధించిన ఆధారాలు సైతం పోలీసులు సేకరిస్తున్నారు. అయితే హర్ష సాయి తరపు న్యాయవాదులు న్యాయపరంగా పోరాటం చేస్తామని అంటున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు అని సదరు న్యాయవాది చెబుతున్నారు. మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు.

Exit mobile version