తమిళ సూపర్ స్టార్ అజిత్ 1993 లో తొలిసారి ప్రేమ పుస్తకం సినిమాకు హీరోగా తన కెరీర్ ప్రారంభించి నేడు తమిళ స్టార్ హీరోగా ఎదిగిన హీరో అజిత్ కుమార్. తమిళనాడులో అజిత్ సినిమా రిలీజ్ అంటే పండగ అనే చెప్పాలి. వివాదాలు, సినిమా ఫంక్షన్స్ కు, అవార్డు ఫంక్షన్స్ కు అజిత్ ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా అజిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి 32 సంవత్సరాలు అవుతున్నసందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read: Vijay Sethupathi : 50రోజులు పూర్తి చేసుకున్న మహారాజ..విజయ్ సేతుపతికి ఎన్నికోట్లు లాభం అంటే…?
అందరూ కొత్త వారితో కొణిదెల నిహారిక నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. 11 మంది నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది నిహారిక. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మేకర్స్ యూనివర్సిటిలలో స్టూడెంట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 9న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Also Read: Kollywood: కంగువ నిర్మాత ఓవర్ కనిఫిడెన్స్ మాటలు.. నెటిజన్స్ సెటైర్లు..
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 4న వైజాగ్ లోని గురజాడ కాలకేత్రంలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో రామ్ పోతినేనితో పాటుగా దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత ఛార్మి తో పాటు యూనిట్ మొత్తం హాజరుకానున్నారు. ఈవెంట్ కు సంబంధించి ఇప్పటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు