NTV Telugu Site icon

Tollywood: ఒక క్లిక్..ముగ్గురు స్టార్ హీరోల లేటెస్ట్ అప్‌డేట్స్..

Untitled Design (24)

Untitled Design (24)

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానున్న ఈ చిత్రంఫై భ్రి అంచానాలు ఉన్నాయి. ఇటీవల విడుడల చేసిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు రానుందని యూనిట్ ప్రకటించింది. డబుల్ ఇస్మార్ట్ డబ్బింగ్ ను రామ్ నిన్న పూర్తి చేసాడు.

అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప-2 డిసెంబరు 6న విడుదలకు శరవేగంగా షూట్ జరుగుతోంది. ఇటీవల విహారయాత్రలకు వెళ్లిన దర్శకుడు తిరిగి వచ్చి షూటింగ్ పనులు ప్రారంభించాడు. కాగా రేపటి నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటాదాని సమాచారం అందుతోంది. ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ పనులు మొదలుపెట్టనున్నాడు సుక్కు. డిసెంబర్ లో పుష్ప రాకపై మిగిలిన సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంది.

Also Read: Prabhas: టాలీవుడ్ లో ఒకే ఒక్కడు ఉప్పలపాటి ప్రభాస్..ఇంక ఎవరి వల్ల కాదు..

యంగ్ టైగర్ ఎన్టీయార్ పాన్ ఇండియా సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన జోడిగా నటిస్తోంది. దేవర షూటింగ్ లో పాల్గొనడం చాల హ్యాపీ గా ఉంటుందని ముఖ్యంగా ఫుడ్ బిర్యానీ, చికెన్ , శాఖాహార వంటకాలు స‌హా ఇత‌ర‌ రకాల వంటకాలను ప్ర‌ద‌ర్శిస్తూ లంచ్ టైమ్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. నేను.. ప్రేమ.. షూటింగ్ కోసం.. దేవర‌” అని జాన్వీ పోస్ట్ చేసింది. చివర్లో ఫైర్, డ్రూలింగ్, లవ్ ఎమోజీలను కూడా జోడించింది. ఇప్పటికే విడుదలైన దేవర ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్ కాగా సెకండ్ సింగిల్ ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.