రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో..
నటి రోహిణి ముల్లేటి మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఎప్పుడూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ‘ఒక మంచి ప్రేమ కథ’తో రాబోతోన్నాను. ఓల్గా గారు రాసిన కథ నాకు చాలా నచ్చింది. కుటుంబరావు గారి ‘తోడు’ సినిమా నాకు ఎంతో ఇష్టం. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ఇలా సినిమా తీయడం సంతోషంగా ఉంది. నేను, రోహిణి గారు చాలా ఏళ్ల క్రితం కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఇలా నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రను చూస్తే ఆడియెన్స్ కోప్పడతారు. రాధాకృష్ణన్ గారి సంగీతం మనసుని హత్తుకుంటుంది. నేను సినిమాను చూసి కంటతడి పెట్టుకున్నాను. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. మేం అడిగిన వెంటనే సపోర్ట్ చేసిన సముద్రఖని గారికి థాంక్స్. మా సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్న ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.
