యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలిసి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’, ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో విజయాలు అందుకున్న నేపథ్యంలో, వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, రూపొందిస్తున్న రెండవ చిత్రమిది. మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా, నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను *’ఓ..! సుకుమారి’*గా రివీల్ చేశారు.
Also Read :IND vs SA 2nd ODI: దంచికొట్టిన కోహ్లీ, రుతురాజ్, కేఎల్ రాహుల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
విడుదలైన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. అలాగే, పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రామ ప్రజలు పరుగెత్తుతూ కనిపించడం కథలోని ఊహించని మలుపులను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పనిచేస్తోంది:’రజాకార్’, ‘పోలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు.
Also Read :Virat Kohli ODI Hundreds: కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు.. బ్యాటింగ్లో దుమ్మురేపిన రుత్రాజ్
‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.’క’ ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్.’స్వయంభు’ చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తో పాటుగా ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఓ..! సుకుమారి’ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
