పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ చిత్రం విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటూ, ప్రీమియర్ షోలకు స్పెషల్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అయితే యూఎస్ లో ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ షో టికెట్ ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాడు. హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ లో కూడా టికెట్ వేలం రూ.1 లక్షకు ముగిసింది. దీని ఉద్దేశం కూడా డొనేషన్లకే. తాజాగా తెనాలిలో కూడా యాభై వేల నుంచి టికెట్ వేలం ప్రారంభం చేయాలని ఆలోచనలో ఉన్నారు. వినడానికి ఇవన్నీ భానే కనిపిస్తున్నాయి. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం దృష్ట్యా ఇది ఒక రిస్క్ అవుతుందని ఫ్యాన్స్ వాపోతున్నారు.. ఎందుకంటే
Also Read : Health Risks of Okra : బెండకాయ ఆరోగ్యకరమే.. కానీ ఈ 5 మంది మాత్రం దూరంగా ఉండాలి
ప్రత్యర్థులు ఈ టికెట్ వేలాలను రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. “విరాళం ఇవ్వాలంటే నేరుగా జనసేనకే ఇవ్వొచ్చు, దానికి సినిమా టికెట్ ఎందుకు?” అన్న ప్రశ్న తలెత్తుతుంది. సోషల్ మీడియాలో “హైప్ కోసం ఫ్యాన్స్ చేస్తున్నారు” అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమా టికెట్ వేలం లీగల్ పరంగా కూడా అంత సులభం కాదు. అసలేం చేయకపోయినా ‘ఓజి’ కి ఇప్పటికే అవసరానికి మించిన బజ్ ఉంది. కాబట్టి ఒక్కో ఏరియాలో ఇలా టికెట్ వేలాలు పెట్టుకోవడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ .‘హరిహర వీరమల్లు’ కి ప్రత్యేక షోలు గవర్నమెంట్ అనుమతి వచ్చినందున, ‘ఓజి’ కి కూడా సమస్య ఉండదని అనుకుంటున్నారు. కానీ అసలు క్లారిటీ ఇంకో నాలుగైదు రోజుల్లో ట్రైలర్ రిలీజ్‌తో తెలుస్తుంది.
