NTV Telugu Site icon

Official : దేవరతో సోలోగా రూ. 300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీయార్

Untitled Design (24)

Untitled Design (24)

దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్  అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.

Also Read : Thandel : కన్నుల విందుగా చైతూ – సాయి పల్లవి కలర్ ఫుల్ స్టిల్…

కాగా దేవర దేవర మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 71 కోట్లు కలిపి మొత్తంగా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టింది. నిన్న మూడవ రోజు వీకెండ్ కావడంతో  రూ. 61 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది దేవర. అటు ఓవర్సీస్ లో మూడు రోజుకు సూపర్ పెర్ఫామ్ చేసింది దేవర. మొత్తంగా మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 304 కోట్లు కొల్లగొట్టి తారక్ సోలో గా కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు అందుకున్నాడు. నేడు సోమవారం కలెక్షన్స్ లో కొంత డ్రాప్ కనిపించే అవాకాశం ఉంది. కాగా ఆక్టోబరు 2న గాంధి జయంతి పబ్లిక్ కావడంతో హాలీడే అడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబరు 3నుండి దసరా సెలవులు కావడం కూడా కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో దేవర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

Show comments