ఒడియా నటీనటులు నడివీధిలో జుట్టుపట్టుకుని కొట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒడియా నటుడు బాబుసన్ మొహంతి భార్య , సహనటి ప్రకృతి మిశ్రా పై దాడి దిగింది. ఈ ఘటన భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. అయితే.. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఒడియా హీరోయిన్ ప్రకృతి మిశ్రా, హీరో బబుసన్ మెహంతి ప్రేమమ్ సినిమాలో కలిసి నటించారు. ఈనేపథ్యంలో ఉత్కల్ అసోసియేషన్ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. కాగా.. మెహంతి భార్య తృప్తి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని బలంగా నమ్మింది. మెహంతి భార్య తృప్తి తన భర్తను ప్రకృతి మిశ్రా మాయచేసి బుట్టలో వేసుకుందని ఆగ్రహంతో ఊగిపోయింది.
read also: Bandi Sanjay Fires on KCR: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసిండు
దీంతో.. తను ఎప్పుడు దొరుకుతుందా అన్నట్లు సమయం కోసం వేచి చూసిన తృప్తి శనివారం నాడు భువనేశ్వర్ నుంచి తన భర్తతో బయలు దేరిన ప్రకృతి కారును రోడ్డుమీదే అడ్డగించింది. ప్రకృతి కారులోకి ఎక్కిన తృప్తి ఆమెను జుట్టుపట్టుకుని లాగింది. దీంతో ప్రకృతి భయంతో దయచేసి సాయం చేయండి అని అభ్యర్థిస్తున్నా అక్కడున్నవాళ్లు మాత్రం వీడియోలు తీయడానికే పరిమితమయ్యారు. ప్రకృతి, తృప్తి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. కారు దిగిన ప్రకృతి పరుగులు పెట్టింది. కానీ నటుడి తృప్తి కూడా ఆమెను వెంబడిస్తూ కొడుతూ.. నెట్టేస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఈ వీడియోనెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
