NTV Telugu Site icon

Odela 2: మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ టీజర్ లాంఛ్

Odela 2

Odela 2

తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’, 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి ఈ సినిమా సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా ఫెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఓదెల 2 మేకర్స్ ఎక్సైటింగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు.

Rashmika Mandanna: హీరోలకు లక్కీ గాళ్ రష్మిక మందన్న!!

కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధుగా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులను అలరించేలా బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారని చెబుతున్నారు. ఓదెల2 భారీ బడ్జెట్‌, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఓదెల 2కి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.