NTV Telugu Site icon

October 2024 Movie Roundup: ఆసుపత్రి పాలైన రజినీకాంత్, గోవింద.. కార్తికేయ -2కి జాతీయ అవార్డు

Karthikeya 2

Karthikeya 2

ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అక్టోబర్ నెల విషయానికి వస్తే

అక్టోబర్ 1: అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్..
శస్త్రచికిత్స అవసరం లేకుండా వైద్యం చేశామని తెలిపిన వైద్యులు అక్టోబర్

అక్టోబర్ 1: బాలీవుడ్ నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్.. గోవిందకు తుపాకీ తూట

అక్టోబర్ 2: మద్రాస్ లో రజినీకాంత్, ముంబైలో గోవింద ఇద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

అక్టోబర్ 5: జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైన కారణంగా ఆయనకు ప్రకటించిన జాతీయ ఉత్తమ నృత్యకారుడి అవార్డును కమిటీ సస్పెండ్

అక్టోబర్ 8: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ‘కార్తికేయ -2’ చిత్ర బృందం ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకారం

అక్టోబర్ 13: శిరీష లేల్లతో నటుడు నారా రోహిత్ వివాహ నిశ్చితార్థం

అక్టోబర్ 21: ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ లో 50 శాతం వాటాను అదర్ పూనావాలాకు అమ్మకం

అక్టోబర్ 24: సెప్టెంబర్ 19న లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్

అక్టోబర్ 28: అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ‘అక్కినేని జాతీయ అవార్డు’ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

Show comments