రెండు బిగెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలైన వార 2, కూలీ సినిమాలు భారీ అంచనాలు మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టాయి. కానీ రెండు ఒక రకమైన టాక్ తెచుకున్నాయి. రెండు సినిమాలలో కథ, కథనాలు ఆశించిన మేర లేవు. కూలీ ప్యూర్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కగా వార్ 2 స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కింది. అయితే ఈ రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ అంతగా పనిచేయలేదని చెప్పాలి. ఉదయం ఆటలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఫస్ట్, సెకండ్ షోలు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టాయి రెండు సినిమాలు.
Also Read : Sreeleela : శ్రీలీల కారణంగా పోస్ట్ పోన్ అవుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీ
తోలి రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ డామినేషన్ చూపించింది. బుక్ మై షో లో గంటకు 34 వేల టికెట్స్ తో దూసుకెళ్ళింది. అలాగే వార్ 2 కు 32 వేలకు పైగా బుకింగ్స్ తో జోరు చూపించింది. అయితే సెకండ్ షోస్ నుండి వార్ 2 లీడ్ తీసుకుంది. నేడు రెండవ రోజు వార్ 2 గంటకు 62.44 వేల టికెట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ 39.47 వేల బుకింగ్స్ తో డే 2 ని సాలిడ్ గా స్టార్ట్ చేసింది. మొదటి రోజు ఎన్టీఆర్ సినిమాను రజిని సినిమా డామినేట్ చేయగా రెండవ రోజు రజనీ సినిమాను ఎన్టీఆర్ సినిమా పూర్తిగా డామినేట్ చేసింది. అయితే మేజర్ కాంట్రిబ్యూషన్ హిందీ లాంగ్వేజ్ నుండి ఉండడం గమనార్హం. నేడు ఇండిపెండ్స్ డే పబ్లక్ హాలిడే కావడంతో రెండు సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. రాబోయే రెండు రోజులు కూడా వీకెండ్ కావడం రెండు సినిమాలకు కాస్త అడ్వాంటేజ్.
