NTV Telugu Site icon

NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..

Ntrneel

Ntrneel

దేవర హంగామా దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ లో తారక్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో స్ట్రాంగ్ మార్క్స్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ లోకి మారాడు తారక్.

Also Read : Lawrence : కాల భైరవుడిగా భయపెడుతున్న లారెన్స్..

కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. గతంలో రామ నాయుడు స్టూడియో అతి కొద్ది మంది సమక్షంలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేసారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా నవంబర్ లాస్ట్ వీక్ నుండి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది. కానీ జూనియర్ ఎన్టీయార్ జనవరి 2025 లో ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ లోగా వార్ -2 ను షూట్ ముగించేస్తాడు. కొంత గ్యాప్ తీసుకుని ప్రశాంత్ నీల్ సినిమా కోసం లుక్ మార్చి జనవరి చివరలో ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనుంది యూనిట్

Show comments