Site icon NTV Telugu

NTR, Neel : నక్క తోక తొక్కిన మమిత బైజు.. భారీ ఆఫర్ కొట్టేసింది‌గా !

Mamitha Baiju

Mamitha Baiju

మలయాళం హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి పరిచయం అక్కర్లేదు. ‘ప్రేమలు’ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చూసేందుకు చాలా చాలా సింపుల్ గానే ఉన్నా, నటన విషయంలో మాత్రం టూ టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నదాని సంబంధించి, సోషల్ మీడియాలో ఇప్పుడు  ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మమిత బైజు సైలెంట్‌గా బడా పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకుందట..

Also Read: Sri vishnu : శ్రీవిష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇంతకి ఎంటా మూవీ అంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఓకె అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతుందట మమిత . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో ప్రశాంత్ నీల్ తారక్ ప్రాజెక్టులో మమితా బైజు నా..? ఇది నిజంగా వెరీ బిగ్ ఆఫర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . అంతే కాదు ఆమె ఎక్కడో నక్కతోక తొక్కినట్టే ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాలో ఆఫర్ కోసం చాలా మంది స్టార్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటి ఆఫర్ మమిత బైజు‌ చేతికి వెళ్లడం నిజంగా ఆమె కెరీర్ కి ఇది చాలా బెస్ట్ ఛాన్స్. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ప్రజంట్ ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version