NTV Telugu Site icon

NTR : భార్యతో ముంబైలో ఎన్టీఆర్.. వీడియో వైరల్..

Whatsapp Image 2024 04 29 At 9.43.04 Am

Whatsapp Image 2024 04 29 At 9.43.04 Am

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా అక్టోబర్ 10 న గ్రాండ్ గా విడుదల కానుంది.అలాగే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న “వార్2″సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే .

అయితే ఇటీవల “వార్ 2 ” షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై చేరుకున్నారు. బాలీవుడ్ లో పార్టీ కల్చర్ కొంచెం ఎక్కువ అని చెప్పాలి. బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే అక్కడి పార్టీ కల్చర్ కి అలవాటు పడాల్సిందే అని కొందరు నటీనటులు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. దీంతో బాలీవుడ్ లో ఎదగాలంటే అక్కడ సెలబ్రిటీలంతా ఆ పార్టీ కల్చర్ లో భాగం అవ్వాల్సిందే. తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళాడు తన భార్య ప్రణతితో కలిసి ముంబై బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు.ఈ పార్టీకి ఎన్టీఆర్, ప్రణతి, రణబీర్ కపూర్, అలియా భట్ మరియు కరణ్ జోహార్ వంటి పలువురు సెలెబ్రెటీస్ హాజరయ్యారు. ఇక పార్టీ ముగించుకొని బయటకు వస్తున్న ఎన్టీఆర్, ప్రణతి వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.