Site icon NTV Telugu

ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

NTR Tests Positive for Covid-19

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్లీజ్ డోంట్ వర్రీ… నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లో ఉన్నాము. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అనిల్ రావిపూడి వంటి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Exit mobile version