NTV Telugu Site icon

War 2: వార్ 2యాక్షన్ సీన్స్ కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారా?

Ntrrr

Ntrrr

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా నటిస్తున్న తాజా చిత్రం దేవర.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, వార్ 2 లో సినిమా లో పాల్గొనాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నారు.. దేవర సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది. వార్ 2 హృతిక్ రోషన్ తో మొదటిసారి స్క్రీన్ ను షేర్ చేసుకొనున్నారు… ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నాడని సమాచారం..

ఇకపోతే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూట్ ను పూర్తి చేసుకుంది.. రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది.. దేవర షూట్ అయ్యాక ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో పాల్గొంటాడు. బాలీవుడ్ సినిమాల్లో, ముఖ్యంగా స్పై యూనివర్స్ సినిమాల్లో యాక్షన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అందులోనూ హృతిక్ సినిమాలో అయితే ఎక్కువగా భారీ స్టంట్స్ ఉండటం మనం చూసే ఉన్నాం.. ఇలాంటి భారీ సీన్స్ చెయ్యడానికి ఖచ్చితంగా డూప్స్ ఉంటారు..

కానీ ఈ సినిమాలు హృతిక్ మరియు ఎన్టీఆర్ లు డూప్ లేకుండానే స్వయంగా యాక్షన్ సీన్స్ చేయబోతున్నారని ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.. వార్ 2 టీమ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్వయంగా యాక్షన్ సీన్స్ డూప్స్ లేకుండా చేస్తారు అని తెలిపినట్టు బాలీవుడ్ సమాచారం.. ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీన్స్ చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా శార్వరి అనే బాలీవుడ్ బ్యూటీ నటించబోతుందని సమాచారం..

Show comments