Chiranjeevi : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటుడుగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.తెలుగు భాష ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకోని వెళ్లిన ఘనుడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ నటుడుగా ,నాయకుడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ “యుగపురుషుడుగా” నిలిచారు.సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అద్భుతముగా రాణించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.నేడు మే 28 ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు , టాలీవుడ్ సినీ ప్రముఖులు ,రాజకీయ ప్రముఖులు ,కార్యకర్తలు మరియు అభిమానులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
Read Also :Rashmika Mandanna : బేబీ దర్శకుడిపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇప్పటికే ఎన్టీఆర్ మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఉదయాన్నే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన తాత జయంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.అలాగే నటుడు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ స్పెషల్ ట్వీట్ చేసారు.కొందరి కీర్తి అజరామరం.భావితరాలకు ఎంతో ఆదర్శం .తారక రామారావు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచిత గౌరవం అని నేను భావిస్తున్నాను.తెలుగు వారి చిరకాల కాంక్ష కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుంది అని ఆశిస్తున్నా అని మెగాస్టార్ తెలియజేసారు.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024