NTV Telugu Site icon

NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై బ్రేకింగ్ అప్డేట్..

Ntr 31

Ntr 31

NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్సె వీడియో రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఈ చిత్రం నుండి “ఫియర్ సాంగ్” ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ప్రస్తుతం ట్రేండింగ్ లో వుంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ అదిరిపోయాయి.ఈ సాంగ్ వింటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వీరి కాంబోలో సినిమాను ప్రకటించారు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. అలాగే ఇది పవర్ హౌస్ ప్రాజెక్ట్ అంటూ భారీ హైప్ ఇచ్చారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Show comments