Site icon NTV Telugu

కొరటాల మూవీలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్

NTR Plays Revolutionary Leader Role in Koratala Movie

‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30ను కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా… నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, నటీనటుల గురించి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా దర్శకుడు కొరటాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ను నిలిపివేసాడు. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని జూనియర్ ఎన్‌టిఆర్‌తో తన రాబోయే చిత్రం కోసం ఉపయోగిస్తున్నాడట కొరటాల. కొరటాల ఈ చిత్రాన్ని ఎమోషనల్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారట. కొరటాల అన్ని చిత్రాలలాగే ఎన్‌టిఆర్ 30లోనూ ఒక సామాజిక ఉండడబోతోందట. తాజా సమాచారం ప్రకారం తారక్ కోసం ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రను కొరటాల రాస్తున్నారట. ఎన్టీఆర్ ఇందులో పవర్ ఫుల్ విప్లవాత్మక నాయకుడి పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ‘జనతా గ్యారేజ్’ భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. వెండితెరపై ఈ క్రేజీ కాంబినేషన్‌ లో మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Exit mobile version