Site icon NTV Telugu

War 2 : వార్ 2 చేయడానికి కారణం ఇదే – ఎన్టీఆర్

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

బాలీవుడ్‌ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’ . వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ లో ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా తొలిసారి ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌పై ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియాకి ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఈ సినిమాను ఎందుకు అంగీకరించాననే ఆసక్తికర విషయం బయటపెట్టారు.

Also Read :Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అసలు కథ తెలుసా?

‘ ‘వార్ 2’ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా టెక్నీషియన్లు కలిసి పనిచేశారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు.. మనమంతా ఇప్పుడు ఒక్కటే – ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ అనే వేరు వేరు పేర్లు ఇక ఉండకూడదు. ఇదే విషయాన్ని రాజమౌళి గారు ఒక సందర్భంలో చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే కథ తీయగలిగితే, భాష ఎలాంటి అడ్డంకి కాదు. హిట్ అవ్వడానికి ఎటువంటి ప్రత్యేక ఫార్ములా అవసరం లేదు. ‘వార్ 2’ ని నేను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని బలమైన స్క్రిప్ట్. కథ నన్ను గట్టిగా ఆకట్టుకుంది. హృతిక్ రోషన్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జీవితంలో ఏదీ ప్లాన్‌ చేసుకోనని అన్నారు. వచ్చిన అవకాశాలను నిజాయతీగా వినియోగించుకుంటా’ అని తెలిపారు.. అలాగే తారక్ తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు.. ‘ నేను నటుడిని మాత్రమే కాదు.. గొప్ప చెఫ్‌నని కూడా. నా భార్య ప్రణతి కోసం, నా స్నేహితుల కోసం వంట చేయడం నాకెంతో ఇష్టం. పునుగులు బాగా వేస్తాను. నా చేతి బిర్యాని కూడా సూపర్ ఉంటుంది’ అని తెలిపారు .

Exit mobile version