NTV Telugu Site icon

NTRNeel: ఎన్టీఆర్ నీల్ సినిమా.. అంతా అవుట్ డోరే!

Ntrneel

Ntrneel

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. గత కొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది.

RGV : విచారణకు హాజరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ..

అంతేకాక ఈ సినిమాలో చాలా అవుట్ డోర్ షెడ్యూల్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. “ఈ సినిమా హైదరాబాద్, కోల్‌కతా, గోవా మరియు శ్రీలంకతో పాటు ఇతర ప్రదేశాలలో చిత్రీకరించబడుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన వెంచర్ కావడంతో కథ సాధ్యమైనంత ప్రామాణికంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. షూట్ ఈ నెలలో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ వచ్చే నెల లేదా ఏప్రిల్ ప్రారంభంలో సెట్స్‌లో చేరనున్నారు అని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ జనవరి 9, 2026న థియేటర్లలోకి రానుంది.