Site icon NTV Telugu

ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో సాంగ్ ?

NTR and Charan’s special song in RRR

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక ప్రత్యేక పాట “ఆర్ఆర్ఆర్”లో ఉండబోతోందట. మునుపెన్నడూ లేని థ్రిల్ ను అందించబోతున్న ఈ సాంగ్ ను షూటింగ్ తిరిగి ప్రారంభమైన వెంటనే చిత్రీకరించనున్నారట. సమాచారం మేరకు ఇంకా ఈ చిత్రంలో చిత్రీకరించడానికి రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై చిత్రీకరించబడుతుంది. ఈ ఒక్క సాంగ్ షూటింగ్ కోసం నెల రోజుల సమయం పడుతుందట. ఈ పాటను చిత్రీకరించడానికి యాక్షన్ ప్లాన్‌ను బృందం రూపొందిస్తోంది. ఈ పాటతో పాటు చిత్రీకరించడానికి మరో ట్రాక్ మిగిలి ఉంది. ఇది రామ్ చరణ్, అలియా భట్ లపై ఉండనుంది అంటున్నారు. టాకీ పార్ట్ విషయానికొస్తే… మొత్తం ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేయడానికి 10 రోజుల సమయం మాత్రమే పడుతుందని తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version