Site icon NTV Telugu

షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య

NS22 resumes shoot in Hyderabad

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజాగా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇరా క్రియేషన్స్ బ్యానర్‌లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య 22వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “ఎన్ఎస్22” పేరుతో పిలుస్తున్నారు. అయితే కరోనా తరువాత సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించామని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో నాగశౌర్య, ఆయన తల్లి ఉషా ముల్పూరి, హీరోయిన్, దర్శకుడు ఉన్నారు. హైదరాబాద్ లో సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను నేడు ప్రారంభించారు.

Read Also : “వాలిమై” యూరప్ ట్రిప్ ?

ఈ చిత్రంలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. మనసులను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా ఓ కీలకమైన పాత్రలో కన్పించబోతోంది. ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పురి దీనిని సమర్పించారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నాగశౌర్య నటిస్తున్న మూడవ చిత్రమిది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో “వరుడు కావలెను” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో, “లక్ష్య” అనే స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నాడు.

Exit mobile version