Site icon NTV Telugu

నోరా ఫతేహి ఫన్నీ వీడియో… వైరల్

Nora Fatehi's hilarious dance moves on Temperature Song

దేశం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో తమ అభిమానుల్లో మనోధైర్యం నింపడానికి, మునుపటి ఉత్తేజం కలిగించడానికి నటీనటులు తమ టాలెంట్ ను వాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దివా, డ్యాన్సర్ నోరా ఫతేహి ఓ వీడియోతో అభిమానులను అలరించారు. నోరా… సీన్ పాల్ వైరల్ సాంగ్ ‘టెంపరేచర్‌’కు వైవిధ్యంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోతో తన అభిమానులను ఉల్లాస పరిచింది. ఆమె తన స్నేహితుడు, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్‌స్టైలిస్ట్ మార్స్ పెడ్రోజోతో కలిసి చేసిన ఈ సరదా వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నోరా “లాక్డౌన్ ను హైప్ చేయడానికి ఇప్పుడే బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి… హ్యాపీ సండే” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ చిత్రంలోని ‘దిల్ బర్’ అనే స్పెషల్ సాంగ్ తో నోరా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె స్టెప్పులేసిన పాటలలో ‘కమరియా, ఓ సాకి సాకి’ యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి. ఇక నోరా ఇటీవలే ఓ ప్రముఖ డ్యాన్స్ షోలో జడ్జిగా చేరారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ‘స్ట్రీట్ డాన్సర్ 3D’లో ఆమె చివరిసారిగా వెండితెరపై కనిపించింది. ప్రస్తుతం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తోంది నోరా. ఈ చిత్రంలో నటులు అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా తదితరులు నటిస్తున్నారు. ‘భుజ్’తో నోరా తొలిసారిగా డిజిటల్ అరంగేట్రం చేయనుంది.

https://www.instagram.com/p/COXoS54J0LI/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Exit mobile version