Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప

Vijay Sethupathi

Vijay Sethupathi

వర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన నటనతో దక్షిణాది సినీ ప్రపంచంలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పడు ఈ స్టార్ హీరో సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు తన వద్దకు వచ్చిన ప్రతి క్యారక్టర్ ను కాదనకుండా ఎన్నో సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించాడు మక్కల్ సెల్వన్. కానీ ఇకపై ఎలాంటి సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘గతంలో కథ నచ్చి చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాను, ఇకపై ఆ రోల్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అయితే ఒకే ఒక్క సినిమాకు మాత్రమే మినహాయింపు ఉంది. అదే జైలర్ 2. సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఉన్న గౌరవంతో మాత్రమే జైలర్ 2′ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాను, ఇకపై మరే సినిమాలోనూ కెమియోలు చేయను. ఒకవేళ ‘జైలర్ 2′ పోస్టర్‌లో నా ఫోటో వేసినప్పటికీ ప్రేక్షకుల దృష్టి కేవలం రజనీ సార్‌పైనే ఉంటుంది. కానీ కొన్ని చిన్న సినిమాల్లో నేను కేవలం అతిథి పాత్ర చేసినప్పటికీ వాళ్లు నా ఫోటోను మెయిన్ పోస్టర్లలో వేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది నేను హీరోగా చేస్తున్న సినిమాల బాక్సాఫీస్ ప్రదర్శనపై, బిజినెస్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నటుడిగా నా మార్కెట్‌ను, తను హీరోగా నటిస్తున్న సినిమాల బాధ్యతను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని వెల్లడించారు.