నేచురల్ స్టార్ నాని ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్‘. మరికొన్ని గంటల్లో స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రముఖ విదేశీ పంపిణీ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేస్తోంది. ఈ రోజు నుంచే ఓవర్సీస్ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సాలిడ్ వసూళ్లు రాబడుతుంది ది ప్యారడైజ్.
అయితే ఈ సినిమాకు తెలుగు వర్షన్ లో చాలా పాదాలకు సెన్సార్ కట్స్ చెప్పింది. కొన్ని పాదాలను తొలగించాలని కూడా సూచించింది. సాధారణంగా కొన్ని సినిమాలకు సెన్సార్ బోర్డు విధించే కట్స్, బియీప్‌ల వల్ల కథలోని సహజత్వం దెబ్బతింటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ ఓవర్సీస్ ప్రేక్షకులకు ప్రత్యంగిర సినిమాస్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాను సెన్సార్ విధించిన 21 కట్స్ లేకుండా, డైలాగ్స్‌కు బియీప్‌లు లేదా మ్యూట్స్ వేయకుండా ఒరిజినల్ వెర్షన్‌లోనే ప్రదర్శించబోతున్నారు. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా అన్-కట్ వెర్షన్‌తో రావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులకు పూర్తిస్థాయి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లభించనుంది. నేటి నుంచే ప్రీమియర్ షోలు పడుతుండటంతో అటు అమెరికా, ఇతర దేశాల్లోని తెలుగు చలనచిత్ర అభిమానులు బిగ్ స్క్రీన్లపై ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

