Site icon NTV Telugu

Nithya Menen: ఆ అనుభవాలే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాయి..

Nithyaminon

Nithyaminon

బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మేనన్,. ఇప్పుడు ‘సార్‌ మేడమ్‌’ చిత్రంతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 25న విడుదల కాబోతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య, ప్రేమ, సంబంధాల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Also Read : Sunny Leone: తెలుగులో సన్నీ లియోన్ ఐటెం సాంగ్..

నిత్య మాట్లాడుతూ.. ‘ఒకప్పటి నా ఆలోచనలతో పోలిస్తే, ఇప్పుడు ప్రేమకు నా జీవితంలో అంత ప్రాధాన్యం లేదు. ప్రేమకు, సోల్‌మేట్‌కు మనం అవసరమని, లేకపోతే జీవితం అసంపూర్ణమని అనుకునే రోజులు నాకు కూడా వచ్చాయి. అలాంటి వ్యక్తిని వెతికిన అనుభవం కూడా ఉంది. కానీ.. కాలక్రమేణా అర్థమైంది.. మన జీవితం ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదని. ఒక్కరే ఉండటం ఒక లోపం కాదు. రతన్ టాటా కూడా పెళ్లి చేసుకోలేదు కదా! జీవితంలో పెళ్లి జరగకపోయినా మరేదేం ఉండదు. కొన్నిసార్లు తోడు లేదు అనే బాధ కలుగుతుంది, కానీ నేను ఈ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను. జీవితంలో అనుభవించిన పాఠాల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఏదైనా జరిగిన అది మన మంచికే అనుకోవడం నేర్చుకున్నాను’ అని అన్నారు ఆమె. ప్రజంట్ నిత్య మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version