Site icon NTV Telugu

Nithin : ‘తమ్ముడు’ నుంచి సాలిడ్ అప్డేట్ కు డెట్‌ఫిక్స్

Nithin Thammudu Movie

Nithin Thammudu Movie

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస ఫ్లాప్ లు ఎదురుకుంటున్న ఈ హీరో తాజాగా ‘రాబిన్‌హుడ్’ తో వచ్చినప్పటికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. స్టోరీ బాగున్నప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నితిన్   ఆశ‌ల‌న్నింటినీ త‌న త‌ర్వాతి చిత్ర ‘త‌మ్ముడు’ పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ లో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలనాటి అందాల తార లయ ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమట.

అయితే షూటింగ్ రెండేళ్లకు ముందే మొద‌లైంది. కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతూ వ‌స్తుంది. దీంతో అస‌లు త‌మ్ముడు రిలీజ‌వుతుందా? అనే అనుమానంలో పడిపోయారు. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఓ క్రియేటివ్ వీడియోను రిలీజ్ చేస్తూ అందులో రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు. జులై 4న ఈ మూవీ రిలీజ్ చేయ‌నున్నట్లు అనౌన్స్ చేశారు.  ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుండి మరో సాలిడ్ అప్‌డెట్ ఇచ్చారు . మే 12న సాయంత్రం 4.05 గంటలకు ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు  ప్రకటించారు. అలాగే ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.  మరి నితిన్ ఈ పవన్ టైటిల్‌తో అయిన గట్టెకుతాడేమో చూడాలి.

Exit mobile version