NTV Telugu Site icon

Nithiin : ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడా చూడలేదు!

Robinhood V Jpg 1280x720 4g

Robinhood V Jpg 1280x720 4g

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీ లీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ ….మార్చి 28న రాబిన్‌హుడ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. నిన్న వచ్చిన అది దా సర్ప్రైజ్ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. దిల్ రాజు గారి వల్ల ఆ వర్డ్ పాపులర్ అయింది కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్తున్నాను. జీవీ ప్రకాష్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ వెంకీ నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా మా కెరీర్ హ్యూజ్ మూవీ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నా బర్త్ డే మార్చ్ 30.

Robinhood: నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్

ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. భీష్మ కి డబల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్ గారు వెన్నెల కిషోర్ మా సీన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. ఎక్కడ అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. ఇంత మంచి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ వెంకీకి థాంక్యూ. మార్చి 28న వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నారు. వెంకీకి ఇది 3.o. కథ ఎమోషన్ స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ వావ్ అంటారు. నాకు శ్రీలీలకు ఈ సినిమా ఒక హిట్ కపుల్ లా నిలబడుతుందనే కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మైత్రి మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీ గా వచ్చేది కాదు.మైత్రీ మూవీ మేకర్ కి థాంక్యూ వెరీ మచ్ మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమాతో మరో సక్సెస్ చూడబోతున్నారు. మార్చి 28 థియేటర్స్ లో కలుద్దాం. తప్పకుండా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు