Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithiin: టాలీవుడ్లో తనకంటే ఎంతో వెనుక వచ్చిన యంగ్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్‌కు దూసుకెళ్తుంటే, చాక్లెట్ బాయ్ నితిన్ మాత్రం ఇంకా రీజినల్ మార్కెట్లోనే నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో యూత్‌ను ఊపేసిన ఈ హీరో, ‘భీష్మ’ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూడలేదు. వరుసగా అరడజనుకు పైగా డిజాస్టర్లు పడటంతో కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నితిన్‌ను గట్టెక్కించే బాధ్యతను నాచురల్ స్టార్ నాని తన భుజాలపై వేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నితిన్‌కు కెరీర్లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు. ‘సై’ తర్వాత డజనుకు పైగా ఫ్లాపులు పడినా పట్టువదలకుండా పోరాడి ‘ఇష్క్’తో గ్రాండ్‌గా బౌన్స్ బ్యాక్ అయిన చరిత్ర ఆయనకుంది. కానీ ఈసారి పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. సరైన సక్సెస్ లేకపోవడంతో ఎలాంటి కథలను ఎంచుకోవాలో అర్థం కాక ‘ఎల్లమ్మ’, ‘స్వారి’ వంటి క్రేజీ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన సినిమా ఉంటుందో లేదో కూడా ఇప్పటికీ సస్పెన్సే. మరోవైపు రామ్ అబ్బరాజుతో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే హిట్లు లేకపోయినా నితిన్‌కు అవకాశాల కొరత లేదని వరుస ఆఫర్లు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా బాక్సాఫీస్ వద్ద ఒక్క సాలిడ్ హిట్ మాత్రమే.
గతంలో విశ్వక్సేన్, అడివి శేష్ వంటి హీరోలతో సినిమాలు తీసి నిర్మాతగా సూపర్ హిట్లు అందుకున్న నాని, ఈసారి నితిన్‌కు సక్సెస్ ఇచ్చే బాధ్యతను తీసుకున్నాడు. తన నిర్మాణ సంస్థ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లో ‘అలియాస్ రుక్మిణి’ అనే ఇంట్రెస్టింగ్ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ రోల్‌లోకి షిఫ్ట్ అయ్యాడు. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా మేనకోడలు ఆఫియా సయ్యద్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమవుతూ టైటిల్ రోల్ పోషిస్తోంది. ‘అలియాస్ రుక్మిణి’ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద నితిన్‌కు పోటీ గట్టిగానే ఉండబోతోంది. నాగచైతన్య ‘వృషకర్మ’, విశ్వక్సేన్ ‘లెగసీ’ వంటి భారీ చిత్రాలతో నితిన్ బాక్సాఫీస్ బరిలో తలపడాల్సి ఉంది. ఈ చిత్రాల పోటీని తట్టుకుని ‘అలియాస్ రుక్మిణి’తో నితిన్ హిట్ కొట్టడం కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. మరి ఈ క్రేజీ ఫ్యామిలీ డ్రామాతో నితిన్ తన ఫ్లాపుల లెక్క సరిచేసి, నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడో లేదో వేచి చూడాలి.
Also Read
- January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
తాజావార్తలు
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!