NTV Telugu Site icon

ట్రోలర్స్ పై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్

Nikki Tamboli Slams Trolls shaming her for 'enjoying' days after her brother's demise

టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి గతవారం సోదరుడు జతిన్ ను కరోనా బాలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వయసు 29. తన సోదరుడి విషాదకరమైన మానించిన అతికొద్ది రోజులకే ఈ బ్యూటీ దక్షిణాఫ్రికాకు ‘కహట్రాన్ కే ఖిలాడి 11’ అనే స్టంట్ బేస్డ్ రియాలిటీ షో షూటింగ్ కోసం వెళ్ళింది. నిక్కీ తన సహ పోటీదారులైన అర్జున్ బిజ్లానీ, రాహుల్ వైద్య, సనా మక్బుల్, అస్తా గిల్ తదితరులతో ఈ షోలో పాల్గొనడానికి వెళ్ళింది. అయితే సోదరుడు మరణించి అతికొద్ది రోజులే అవుతున్నా ప్రొఫెషనల్‌గా ఉన్నందుకు చాలా మంది నిక్కీని మెచ్చుకున్నారు. మరోవైపు ఆమె సోదరుడు చనిపోయిన కొద్ది రోజులకే ‘ఎంజాయ్’ చేస్తోందంటూ చాలా మంది ఆమెను ట్రోల్ చేశారు. దీంతో ట్రోలింగ్ పై ఫైర్ అయ్యింది నిక్కీ. కొంతమంది స్టుపిడ్స్ నా సోదరుడు చనిపోయిన కొన్ని రోజులకే నేను ఎంజాయ్ చేస్తున్నాను అని, అందుకు నేను షేమ్ గా ఫీల్ అవ్వాలని నాకు మెసేజ్ చేస్తున్నారు. నా పిక్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. అలంటి ఇడియట్స్ కు చెప్తున్నా… నాకు కూడా లైఫ్ ఉంటుంది. నా కోసం కాకపోయినా నేను హ్యాపీగా ఉండాల్సి ఉంటుంది. నేను హ్యాపీగా ఉంటేనే నా బ్రదర్ నన్ను ఇష్టపడతాడు. ఓన్లీ కామెంట్స్ చేయడానికి, నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి మాత్రమే టైం ఉండే పనీపాటా లేని వ్యక్తులు వెళ్ళి మీ డ్రీమ్స్ ను సాధించుకోండి. అలా చేస్తే మీ తల్లిదండ్రులు, మీరు ప్రేమించే వ్యక్తులు సంతోషిస్తారు” అంటూ ట్రోలర్స్ పై ఘాటుగా స్పందించిన నిక్కీ.