Nikhil Siddarth : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీభారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఇదిలా ఉంటే నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also :Ilaiyaraaja Biopic : మ్యూజిక్ మాస్ట్రో కు ‘ఇళయరాజా’ మూవీ టీం స్పెషల్ బర్త్ డే విషెస్..
ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ , నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో కత్తి తిప్పుతున్నయోధుడి లుక్ లో నిఖిల్ కనిపించారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే స్వయంభు షూటింగ్ స్పాట్‌లో చిత్ర యూనిట్ నిఖిల్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. యుద్ధం చేసే పెద్ద కత్తితో నిఖిల్ తన బర్త్డే కేక్‌ను కట్ చేశాడు.చిత్ర యూనిట్ అంత నిఖిల్ బర్త్డే ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
