NTV Telugu Site icon

Nikhil : సినిమా రిలీజ్ ఇప్పుడే.. మరి ప్రచారం ఎప్పుడో..?

Nikhil

Nikhil

కార్తికేయ 2 చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ క‌థానాయకుడిగా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ దీన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌ల చేసిన సినిమా ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Also Read :Allu Arjun : బన్నీ – శ్రీలీల స్పెషల్ సాంగ్ క్రేజి అప్డేట్..

దసరా కానుకగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై కాసింత ఆసక్తి కలిగేలా చేసింది. కాగా ఈ సినిమా న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానుంది. కానీ చిత్ర నిర్మాణ సంస్థపై నిఖిల్ ఫాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సదరు సంస్థ తమ అభిమాన హీరో సినిమాను అసలు పట్టించుకోవట్లేదు అని, కనీసం పబ్లిసిటీ చేయట్లేదని వారు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరో వారం రోజుల్లో రానున్న సినిమా గురించి కనీసం ఎవరికి తెలియదని ఫాన్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రమోషన్స్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఇక కన్నడ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. మ‌రోక దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

Show comments