Site icon NTV Telugu

Ghatikachalam: భయపెట్టేలా ఘటికాచలం టీజర్

Ghatikachalam Teaser

Ghatikachalam Teaser

Nikhil Devadula Ghatikachalam Official Teaser : నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు అమర్ కామెపల్లి రూపొందిస్తున్నారు. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. “ఘటికాచలం” సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేెఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి. ఈరోజు “ఘటికాచలం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది.

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ కథ అదే.. ఎస్కేఎన్ ఓపెనయిపోయాడుగా!

రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు, అలా ఘటికాచలం సినిమా మొదలైంది. మంచి టెక్నీషియన్స్ మనకు కావాల్సిన బడ్జెట్ లో ఎవరు దొరుకుతారని చూశాను. మంచి టీమ్ దొరికారు. ఇలాంటి సినిమా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు. మారుతి గారికి ట్రైలర్ చూపించా, ఆయనకు నచ్చి మూవీ చూపించు అన్నారు. చూపించాను, మారుతి గారికి మూవీ నచ్చింది. చిన్న చిన్న మార్పులు చెప్పారు. ఎస్కేఎన్ చూశారు, ఆయనకూ నచ్చింది. క్రూషియల్ చేంజెస్ మారుతి గారు ఎస్కేఎన్ చెప్పారు. వారు చెప్పిన మార్పులు చేశాను. మూవీని టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి అన్నారు. నిఖిల్ దేవాదుల, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి, తదితరులు నటిస్తున్న ఈ సినిమా టీజర్ భయపెట్టేలా ఉంది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.

Exit mobile version