మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాని అవేవి నిహారికకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో సినిమాలను పక్కన పెట్టి తాను ప్రేమించిన చైతన్యను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ కొన్నాళ్ళకు ఆ బంధానికి బీటలు పడడంతో విడాకులు తీసుకుని మరల సినిమాల్లో యాక్టివ్ అయింది నిహారిక.
ప్రస్తుతం నిహారిక మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘మద్రాస్ కారన్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఆమె నటించిన సినిమాలలో పక్కింటి అమ్మాయిలా నటించిన నిహారిక ఈ సినిమాలో ఓ రెంజ్ లో అందాలు ఆరబోసింది. తాజాగా ఈ సినిమా నుండి ‘కాదల్ సదుగువు’ అని సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో షేన్ నిగమ్ తో నిహారిక చేసిన రొమాన్స్ చలికాలంలో కూడా చెమటలు పుట్టిస్తుందనే చెప్పాలి. బౌండరీస్ చెరిపేస్తూ నిగమ్ తో అద్భుతంమైన కెమిస్ట్రీ పండించింది. అదే విధంగా ఈ సాంగ్ లో నిహారిక అద్భుతమైన డాన్స్ చేసింది. అలాగే సాంగ్ లో తన హావభావాలు కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉన్నయనే చెప్పాలి. చూస్తుంటే నిహారిక ఇక నుండి సినిమాలపై సీరియస్ గా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది అందుకు తగ్గట్టు తనని తాను మార్చుకుని అన్నిటికి రెడీ అన్నట్టు కనిపిస్తోంది ఈ మెగా డాటర్.