మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల, కెరీర్ ప్రారంభంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వున్నా, మొదటి సినిమాతోనే ఫ్లాప్‌లు ఎదుర్కొంటూ కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే పెద్దల సమక్షంలో ప్రఖ్యాత వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డ తో వివాహం చేసుకున్నారు. ప్రారంభంలో సంబంధం సజావుగా సాగినప్పటికీ, తర్వాత విభేదాలు చోటు చేసుకోవడంతో వీరి విడాకులు చోటు చేసుకున్నాయి.
Also Read : Sreeleela : ఎన్టీఆర్ వల్లే శ్రీలీల కూచిపూడి నేర్చుకుంది..
ఇవ్వని తట్టుకున్న నిహారిక తనను తాను తిరిగి నిరూపించుకోవాలని నిర్ణయించుకుని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు నిర్మించడం ప్రారంభించారు. ఇందులో “కమిటీ కుర్రోళ్ళు” సినిమాతోనే వెండితెరపై విజయాన్ని సాధించారు. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు కూడా అందింది. అయితే కెరీర్ ఎలా ఉన్నప్పటికీ నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. వర్షంలో హైదరాబాద్ నగర అందాలను ఆస్వాదిస్తూ, ప్రకృతి సౌందర్యంలో తడుస్తూ ఉన్న వీడియో ఎంతో మందికి ఆకట్టుకుంది. అయితే ఆమె పోస్ట్ ఇలా రాశారు..
“నా ఫ్రెండ్ చెప్పినట్టు, ఇదంతా హీరోయిన్ చనిపోయే ముందు చివరి సీన్ లాగా ఉంది. నా ఫేస్‌లో అటెన్షన్ ఎలా ఉందో చూడాలంటే చివరి వరకు ఉండాల్సిందేనని” ఈ కామెంట్‌తో సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యంగా కామెంట్స్ పెడుతున్నారు. నిహారికకు ఏమైంది? ఎందుకు ఇలాంటి పోస్టు పెట్టారు? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది.
