NTV Telugu Site icon

Niharika Konidela : 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

Ck 50 Days

Ck 50 Days

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆకట్టుకుంది ఈ చిత్రం. డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు.

Also Read : Dadasaheb Phalke : మిథున్ చక్రవర్తికి బాలయ్య స్పెషల్ విషెష్

సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాల‌నే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. రోజు రోజుకీ ఆద‌ర‌ణ‌తో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను కూడా పెంచుకోవ‌టంలో క‌మిటీ కుర్రోళ్ళు స‌క్సెస్ అయ్యారు. ఈ సినిమా తాజాగా 50 రోజులు రన్ పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించి  50 రోజుల వేడుక సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు మేకర్స్. ఇటీవల ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది