NTV Telugu Site icon

రామ్ తో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ ?

Nidhi Agarwal high voltage special dance number in Ram Movie

గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ రామ్ తో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడనుందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో నిధి హీరోయిన్ గా కాకుండా ఐటమ్ గర్ల్ గా కన్పించబోతోందట. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కు రామ్ తో కలిసి చిందేయనుందట నిధి. హై వోల్టేజ్ స్పెషల్ డ్యాన్స్ నంబర్ కోసం నిధిని మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ వార్తపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. శ్రీనివాస చిత్తూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఆయన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో నిర్మించనున్నారు. కాగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన “ఇస్మార్ట్ శంకర్”లో నిధి అగర్వాల్ తన గ్లామర్ షో, పర్ఫార్మెన్స్ తో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు నిధి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు. మరోవైపు నిధి ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమతో కూడా తన అదృష్టాన్ని పరీక్షిస్తోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తో “హరి హర వీర మల్లు”లో హీరోయిన్ గా నటిస్తోంది నిధి.