Site icon NTV Telugu

అలాంటివి షేర్ చేయకండి.. అవి చీప్ పనులు: నిధి అగర్వాల్‌

టాలీవుడ్ అందాల బ్యూటీ నిధి అగర్వాల్‌ కావాల్సినంత గ్లామర్ ను ఆరబోస్తున్న.. కొందరు ఆకతాయిలు మాత్రం ఆమెకు ఫేక్ ఫోటోలు షేర్ చేస్తూ కోపం తెప్పిస్తున్నారు. తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టీవ్ గా వుండే నిధి సడెన్ గా సీరియస్ అయింది. ఈమేరకు ఓ పోస్ట్ చేసింది. ‘నాకు సంబంధించిన ఓ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.. అది అనసరం.. అలాంటి చీప్‌ పనులు చేసి తన దృష్టిలో దిగజారవద్దని పేర్కొంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని పంచుకుంది. అయితే ఆమె అంతలా ఫైర్‌ కావడానికి కారణమైన ఫోటో ఏదో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version