Site icon NTV Telugu

Nidhhi Agerwal : ‘పాపా.. మీ మమ్మి నంబర్ ఇవ్వు’.. నిధి అగర్వాల్‌కు నెటిజన్ షాకింగ్ కామెంట్!

Nidhi Agarwal

Nidhi Agarwal

తెలుగు తెరపై ఓ మంచి ఛాన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిధి అగర్వాల్‌కి మంచి రోజులు వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా ‘ హరిహర వీరమల్లు’, ‘రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టుల్లో భాగమవుతూ వచ్చిన ఆమె, సినిమాలు ఆలస్యం కావడం వల్ల తెరపై కనబడేందుకు కాస్త వెనుకబడిపోయారు. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, నిధికి మళ్లీ టాలీవుడ్‌లో కొత్త జోష్ రానుందని తెలుస్తోంది.

Also Read : SSMB 29: రాజమౌళి ఫిల్మ్‌లో.. మహేశ్ డాడీ‌గా తమిళ హీరో ?

ఈ రెండు సినిమాలూ మంచి విజయం సాధిస్తే, నిధికి భారీగా అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే వీరమల్లు ప్రమోషన్‌లో భాగంగా, నిధి సోషల్ మీడియాలో చాలాకాలంగా యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తోంది. ఇటీవల ట్విట్టర్‌లో ఫాలోవర్స్‌తో చిట్ చాట్ సందర్భంగా ఎంతో ఇన్స్పైరింగ్ విషయాలు షేర్ చేసింది.. ఇందులో భాగంగా .. ‘సినిమా ఇండస్ట్రీ చాలా కష్టమైన రంగం. ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే.. తిరస్కరణలకూ, సవాళ్లకూ సిద్ధంగా ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఫలితం రావాల్సిన టైమ్‌లో తప్పకుండా వస్తుంది’ అని నిధి తన అనుభవాన్ని పంచుకుంది.

ఇంతలోనే మరో నెటిజన్ ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో మళ్లీ నటించాలంటే అదృష్టం ఉండాలి. అవకాశం వస్తే ఇద్దరితోనూ తిరిగి నటించడాన్ని నేనెప్పుడూ సిద్ధం’ అని నిధి చెప్పారు. అలాగే తమిళ సినీ పరిశ్రమలో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ .. ‘అక్కడ చాలామందితో పని చేశాను. అందరూ నాకు చాలా ఇష్టమైన వారు. రీసెంట్‌గా నేను చూసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా నాకు బాగా నచ్చింది’ అని చెప్పుకొచ్చారు నిధీ. చివరగా . పాప మీ అమ్మ నంబర్ ఇవ్వు.. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను అని ఓ నెటిజన్ అంటే.. ‘అవునా.. నువ్వు చాలా నాటీ’ అని సింపుల్‌గా ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు నిధి అగర్వాల్.

Exit mobile version