Site icon NTV Telugu

HHVM : నిధి ఆన్ ప్రమోషన్స్ డ్యూటీ!

Nidhhi Agerwal Hari Hara Veera Mallu

Nidhhi Agerwal Hari Hara Veera Mallu

టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో అందాల తార నిధి అగర్వాల్ (చాందిని) అనే పాత్రలో నటిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ పౌరాణిక నేపథ్యంలో రూపొందుతుండగా. గ్రాండ్ విజువల్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇక అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నగా ఈ మూవీ కోసం ముద్దు గుమ్మ నిధి చాలానే కష్టపడుతుంది.

ముందు నుంచి కూడా ఈ సినిమా మీద నిధికి ఉన్న అంచనాలు ఎంతగానో ఉన్నప్పటికీ, ఆమె ఈ చిత్రం కోసం చేసిన కృషి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రొమోషన్ కార్యకలాపాల్లో భాగంగా నిధి అగర్వాల్ తన డెడికేషన్‌ను మరోసారి నిరూపించింది. ఒక్కరోజులో ఏకంగా 15కి పైగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలు ఒక్కోటి సగటున 30 నిమిషాల పాటు కొనసాగినప్పటికీ, నిధి ఎనిమిది గంటలపాటు నిరంతరంగా కూర్చుని మాట్లాడటం అభిమానుల్ని ఫిదా అయ్యేలా చేసింది. ఆమె త్యాగం, పట్టుదల చూసి “ఇంత డెడికేషన్ చూస్తే భవిష్యత్తులో నిధికి మరిన్ని గొప్ప అవకాశాలు రావడం ఖాయం” అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా నిధి కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆమె భావిస్తోంది.

Exit mobile version