NTV Telugu Site icon

Niharika Konidela: ఈ డాష్ లు ఏంటి.. ఆ బూతులు ఏంటి.. నిహారిక.. ?

Niharika

Niharika

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అనంతరం పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ను నిర్మించి యూట్యూబ్ లో షార్ట్స్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. నటిగా కన్నా నిర్మాతగానే నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భర్తతో విడాకులు అయ్యిన తరువాత ఆమె మళ్లీ నటిగా మారడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక నిహారిక .. యాంకరింగ్ లో కూడా ఆరితేరిందని చెప్పొచ్చు. నాగబాబు జడ్జిగా చేసిన షోస్ లలో నిహారిక యాంకర్ గా చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు నిహారిక యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది. ఆహా ఓటిటీలో చెఫ్ మంత్ర అనే కుకింగ్ షో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. మొదటి సీజన్ శ్రీముఖితో మొదలవ్వగా .. రెండో సీజన్ మంచు లక్ష్మీ.. ఇప్పుడు నిహారిక మూడో సీజన్ లోకి అడుగుపెట్టింది.

ఇక నిహారిక యాంకరింగ్ అనగానే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. సెలబ్రిటీలు బాగానే వచ్చారు. ఇప్పటికి మూడు ఎపిసోడ్స్ అయ్యాయి. అయితే మొదటి ఎపిసోడ్ నుంచి ఈ షో పై విమర్శలు తలెత్తడం మొదలుపెట్టాయి. అందుకు కారణం ఈ షోలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉండడం. ముఖ్యంగా డాష్ అనే సెగ్మెంట్ లో అయితే ఆ మాటలు వినడం కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మీకు డాష్ ఉందా.. ? అర్ధరాత్రి బెడ్ మీద మీరు డ్యాష్ చేస్తారా.. ? నీ డాష్ కు ఎప్పుడైనా ఫొటో తీసి పంపావా, నీ డాష్ హ్యపీ అంటూ వెకిలి ప్రశ్నలు.. దానికి మళ్లీ నవ్వులు. ముఖ్యంగా నవదీప్, తేజస్వీ మదివాడ ప్రోమోలో అన్ని ఇలాంటివే ఉన్నాయి. ఆ మాటలను వారు ఎంజాయ్ చేస్తున్నా కూడా వినేవాళ్లకు మాత్రం దారుణంగా ఉన్నాయి. దీంతో నిహారికపై చాలా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ డాష్ లు ఏంటి.. బూతులు ఏంటి.. నిహారిక.. ? ఇంతకంటే మంచి షో దొరకలేదా.. ? అని కొందరు. అసలు చెఫ్ మంత్రనా.. ? డాష్ మంత్రనా.. ? అని కామెంట్స్ చేస్తున్నారు.